బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ లో ఫైమా సేవ్.. రాజ్ అవుట్!
on Nov 28, 2022
బిగ్ బాస్ హౌస్ లో సండే ఫండే అంటూ నాగార్జున వచ్చేసాడు. ఇక కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడిస్తూ, టాస్క్ లు చేపించాడు. ఎప్పటిలాగే ఆదిరెడ్డిని డ్యాన్స్ చేపించాడు. ఆ తర్వాత రెండు జట్లుగా విభజించారు. ఒక్కో జట్టు నుండి ఒక్కొక్కరుగా వచ్చి గేమ్ లో పాల్గొనాలి. అదేంటంటే నోట్లో బబుల్ గమ్ పెట్టుకొని పాట పేరు చెప్పమని చెప్పగా, ఈ గేమ్ లో ఆదిరెడ్డి జట్టు గెలిచింది.
బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ వారం ఎలిమినేషన్ అనేది కామన్ గా జరిగేదే. అయితే ఈ వారం మాత్రం ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు జరిగాయి. కారణం ఫైమా, రోహిత్, ఆదిరెడ్డి, రాజ్ డేంజర్ జోన్ లో ఉండగా, రోహిత్ ఎలిమినేషన్ అనే వార్త నిన్నటిదాకా నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. సడన్ గా రాజ్ ఎలిమినేషన్ అవ్వడం అనేది వీక్షకులకు పెద్ద ట్విస్టే. ఎందుకంటే ఓటింగ్ లో రాజ్ కంటే ఫైమా కాస్త మెజారిటీతోనే ఉంది. కానీ బిగ్ బాస్, ఫైమాని ఎవిక్షన్ ఫ్రీ పాస్ యూజ్ చేసేలా ప్లాన్ చేసి, ఫైమాని పాస్ వాడుకునేలా చేసాడు. దీంతో ఫైమా సేవ్ అయ్యి, రాజ్ ఎలిమినేట్ అయ్యాడు.
అయితే నిన్న మొన్నటి దాకా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. రోహిత్ సెకండ్ ఎలిమినేషన్ గా బయటకొస్తాడని అని అనుకున్నారంతా, కానీ బిగ్ బాస్ రాజ్ ని సింగిల్ గా ఎలిమినేట్ చేసాడు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
